గ్రామాల్లో కరోనా వ్యాప్తికి రైతుల ఆందోళనలు ఓ కారణం అని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. కొన్ని గ్రామాల్లో గతేడాది కన్నా ఎక్కువ మరణాల రేటు నమోదైందని తెలిపారు.
రైతుల ఆందోళనల్లో పాల్గొన్నవారి గ్రామాల్లో, ధర్నాలు నిర్వహిస్తున్న గ్రామాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది. ఈ గ్రామాల్లో గత ఏడాది కన్నా 6 నుంచి 10 శాతం మరణాల రేటు పెరిగింది. ఇది కరోనాతో కాదని వాదిస్తే.. ఇంకా ఏ మహమ్మారి ప్రస్తుతం లేదు. వేల సంఖ్యలో ఒకే దగ్గర గుమిగూడుతూ.. కొవిడ్ నిబంధనలు పాటించలేదు.
-మనోహర్ లాల్ ఖట్టర్, హరియాణా సీఎం