Khammam District Political War :ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి రాజకీయ ముఖచిత్రం ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. 2018 నుంచి 2023 మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో... కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాత అభ్యర్థులే పోటీ పడుతున్నా... వారి పార్టీలు, గుర్తులు మారాయి. ఇల్లందు నియోజకవర్గంలో పోటీ పడుతున్న బానోత్ హరిప్రియ నాయక్, కోరం కనకయ్య గత ఎన్నికల్లో ప్రత్యర్థులే. కాంగ్రెస్, బీఆర్‌ఎస్(BRS) నుంచి పోటీ చేసిన ఇద్దరు... ఇప్పుడు అటూ ఇటూ మారారు.
కాంగ్రెస్ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి - రైతులు అరేబియా సముద్రంలోకి : సీఎం కేసీఆర్
Telangana Assembly Elections 2023 :ఓటర్లకు మారిన గుర్తులు తెలిపేందుకు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు. తనది హస్తం(Congress)గుర్తుని కనయ్య.. కారు గుర్తుపై పోటీ చేస్తున్నాని హరిప్రియనాయక్ ప్రచారం చేసుకుంటున్నారు. పినపాక నియోజకవర్గంలోనూ... ఇలాంటి చిత్రమే కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రేగా కాంతారావు... ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచి, అప్పుడు బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన పాయం వెంటకేశ్వర్లు... ఈసారి కాంగ్రెస్ నుంచి తలపడుతున్నారు. కొత్త గుర్తులతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Political Twists in Telangana :2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో.. కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి ఈసారి బీఆర్‌ఎస్ నుంచి కారు గుర్తుపై పోటీ చేస్తున్నారు. పాలేరులో కారు గుర్తుపై బరిలో నిలిచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఈసారి కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం నుంచి హస్తం గుర్తుపై రంగంలోకి దిగారు. టీడీపీ నుంచి మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఘనత సాధించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. ఈసారి కారు గుర్తుతో ప్రజల్లోకి వెళ్తున్నారు.