తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతుల కోసం 'కిసాన్​ మాల్​'- అన్నీ ఫ్రీ! - టిక్రి సరిహద్దులో కిసాన్​ మాల్ ఏర్పాటు

సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తోన్న రైతులకు చేయూత అందిస్తోంది ఓ అంతర్జాతీయ ఎన్జీఓ. రైతులకు నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించేందుకు టిక్రి సరిహద్దులో ఓ ప్రత్యేకమైన మాల్​ను ఏర్పాటు చేసింది.

Khalsa Aid sets up Kisan Mall at Delhi's Tikri border for protesting farmers
రైతుల కోసం దిల్లీ సరిహద్దులో 'కిసాన్​ మాల్​' ఏర్పాటు

By

Published : Dec 25, 2020, 1:29 PM IST

రైతుల కోసంఏర్పాటు చేసిన కిసాన్​ మాల్

ముఫ్పై రోజులుగా దిల్లీ సరిహద్దుల్లోనే ఉంటూ... కేంద్రం అమలు చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసనలు సాగిస్తున్న రైతులకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది అంతర్జాతీయ ఎన్జీఓ ఖల్సా ఎయిడ్. వారికి నిత్యావసర వస్తువులు ఉచితంగా అందించేందుకు దిల్లీలోని టిక్రి సరిహద్దు వద్ద 'కిసాన్​ మాల్'​ను ఏర్పాటు చేసింది.

సబ్బులు, టూత్​ బ్రష్​లు, టూత్​ పేస్ట్​లు, నూనె, దుప్పట్లు, చెప్పులు మొదలైన నిత్యావసర వస్తువులను రైతులకు అందిస్తోంది ఖల్సా ఎయిడ్.

"కిసాన్​ మాల్​ నుంచి రైతులు నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు ఖల్సా ఎయిడ్ ద్వారా టోకెన్లు ఇస్తాం. ఈ టోకెన్​ తీసుకుని రైతులు మాల్​కు వెళ్తారు. ఇక్కడ ఏఏ వస్తువులు ఉన్నాయో పేర్కొంటూ మేం ఒక జాబితా తయారు చేశాం. దాదాపు అన్ని వస్తువులు ఇక్కడ లభ్యమవుతాయి. ఖల్సా ఎయిడ్​ వలంటీర్లు రైతులకు కావాల్సిన వస్తువులను సంచి​లో పెట్టి ఇస్తారు. రోజుకు మేం దాదాపు 500 టోకెన్లు ఇస్తున్నాం".

-గురు చరణ్, స్టోర్ మేనేజర్

దిల్లీ-హరియాణా సరిహద్దులో డిసెంబర్​ 11న రైతుల కోసం చెప్పుల దుకాణం ఏర్పాటు చేసింది ఖల్సా ఎయిడ్ సంస్థ.

ఇదీ చదవండి:సాగు చట్టాలపై మోదీ కీలక ప్రసంగం!

ABOUT THE AUTHOR

...view details