సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో పోరాటం చేస్తోన్న రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పలువురు.. ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సింఘు సరిహద్దులో.. నిరసనలు చేపట్టి అలసిపోయిన రైతులు సేదతీరేందుకు 'ఫుట్ మసాజర్స్' ఏర్పాటు చేసింది 'ఖాల్సా ఎయిడ్-ఇండియా' అనే ఎన్జీఓ. 25 మసాజర్స్ను అందించింది. ముందుగా వయస్సుపైబడిన వారికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపింది.
" సుదీర్ఘకాలంగా ఇక్కడే ఉన్న వయస్సు పైబడిన రైతులకు ఈ ఫుట్ మసాజర్స్లో సేదతీరేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరసనల్లో ఎక్కువ సమయం ఉండటం వల్ల వారు అలసిపోతున్నారు. "