కేరళ ప్రభుత్వం తొలిసారి మెజారిటీ జిల్లాలకు కలెక్టర్లుగా మహిళా అధికారులను నియమించింది. మొత్తం 14 జిల్లాలకు గానూ 8 జిల్లాలకు వారినే ఎంపిక చేసింది. కాసర్గోడ్ జిల్లా చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఓ మహిళా ఐఏఎస్ అధికారి కలెక్టర్ పగ్గాలు చేపట్టారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ కేరళ సర్కార్ తన మార్క్ పాలనను మరోసారి చాటిచెప్పింది.
8 జిల్లాల మహిళా కలెక్టర్ల వివరాలు..
- తిరువనంతపురం- డా. నవజోత్ ఖోస
- పథానంతిట్ట- డా.దివ్య అయ్యర్
- కొట్టాయం- డా.పీకే జయశ్రీ
- ఇడుక్కి- షీబ జార్జ్
- త్రిస్సూర్- హరిత వి కుమార్
- పాలక్కడ్- మృన్మయి జోషి
- వయనాడ్- డా.అధీలా అబ్దుల్లా
- కాసర్గోడ్- భండారి స్వాగత్ రణ్వీర్చాంద్