ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) నిర్వహిస్తున్న దేవాలయాల్లో తొలిసారి షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తి ఆలయ పూజారి కానున్నారు. కేరళలో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు 1200కు పైగా దేవాలయాలను టీడీబీ నిర్వహిస్తోంది. వీటిలో షెడ్యూల్డ్ కులానికి చెందిన 18 మందిని, షెడ్యూల్డ్ తెగకు చెందిన ఓ వ్యక్తిని పూజారులుగా నియమించాలని ఇటీవల నిర్ణయించింది.
కేరళలో పూజారిగా తొలిసారి ఎస్టీ వ్యక్తి
షెడ్యూల్డ్ తెగకు చెందిన ఓ వ్యక్తిని దేవాలయ పూజారిగా నియమించనున్నట్లు కేరళలోని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఇటీవల నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎస్టీ వ్యక్తిని ఆలయ పూజారిగా నియమించడం ఇదే తొలిసారని ఆ రాష్ట్ర దేవస్థానాల మంత్రి సురేంద్రన్ తెలిపారు.
కేరళలో తొలిసారి పూజారిగా ఎస్టీ వ్యక్తి
"టీడీబీ నిర్వహిస్తున్న ఆలయాల్లో షెడ్యూల్డ్ తెగకు చెందిన వ్యక్తిని పూజారిగా నియమించడం ఇదే తొలిసారి" అని కేరళ రాష్ట్ర దేవస్థానాల మంత్రి సురేంద్రన్ ఫేస్బుక్లో తెలిపారు.
ఇదీ చదవండి-కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా వైకే సిన్హా
TAGGED:
kearala preist