తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నారీశక్తి అవార్డు గ్రహీత భగీరథీ అమ్మ ఇకలేరు

కేరళ కురువృద్ధురాలు భగీరథీ అమ్మ ఇక లేరు. కొల్లం జిల్లాలోని ఆమె నివాసంలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మహిళా సాధికారత కోసం పాటుపడిన వ్యక్తిగా అమ్మకు పేరుంది.

Kerala's oldest student
భగీరథీ అమ్మ ఇకలేరు

By

Published : Jul 23, 2021, 10:43 PM IST

105 ఏళ్ల ప్రాయంలో.. కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్​లో భాగంగా 2018లో నాలుగో తరగతి పూర్తి చేసి వార్తల్లో నిలిచిన భగీరథీ అమ్మ కన్నుమూశారు. గురువారం రాత్రి కొల్లంలోని ఆమె స్వగృహంలో 107ఏళ్ల భగీరథీ అమ్మ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

భగీరథీ అమ్మ

వయసుతో సంబంధం లేకుండా చదువు పట్ల ఆమె చూపిన శ్రద్ధ ఎందరికో ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోదీ సైతం 'మన్​కీ బాత్'​ కార్యక్రమంలో ప్రస్తావించారు. వందేళ్లకు పైగా జీవించిన ఆమె మహిళా సాధికారతకు ఎంతో కృషి చేశారు. ఇందుకుగానూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నారీశక్తి అవార్డు ఇచ్చి గౌరవించింది.

మునిమనవరాలు, మునిమనవడితో అమ్మ
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నారీశక్తి పురస్కారం

భగీరథీ అమ్మ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్​ ఆరిఫ్​ మహమ్మద్​ ఖాన్​, ముఖ్యమంత్రి పినరయి విజయన్​ సంతాపం తెలిపారు. మహిళల సాధికారత, అక్ష్యరాస్యతకు నిలువెత్తు నిదర్శనమని విజయన్​ ఆమెను కొనియాడారు.

ఇదీ చూడండి:4వ తరగతి పాసైన బామ్మలకు.. నారీశక్తి పురస్కారం

ABOUT THE AUTHOR

...view details