బాలుడిని చంపి బీరువాలో దాచిన మహిళ Tamil Nadu woman killed boy: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారిని పొరుగున ఉండే ఓ మహిళ హత్య చేసింది.
కడియాపట్టణంలో నివసించే ఫాతిమా.. చిన్నారి శరీరంపై ఉన్న బంగారాన్ని దొంగలించింది. అనంతరం బాలుడి నోట్లో గుడ్డలు కుక్కి.. హతమార్చింది. మృతదేహాన్ని ఇంట్లోని బీరువాలో దాచేసింది. చిన్నారి ఆచూకీ దొరకకపోవడం వల్ల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
Boy killed kept in cupboard:
రంగంలోకి దిగిన రక్షక భటులు.. తల్లిదండ్రుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం పొరుగింటి వారిని విచారించారు. పక్కింట్లో ఉండే ఫాతిమా అనే మహిళపై పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను ప్రశ్నించగా నిజం బయటపడింది. బాలుడిని తానే హత్య చేసినట్లు మహిళ ఒప్పుకుంది. బీరువాలో దాచినట్లు చెప్పేసింది.
నిందితురాలి ఇంటి వద్ద గ్రామస్థులు ఈ ఘటనపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బాలుడిని చంపి, బీరువాలో దాచడంపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. భారీ సంఖ్యలో స్థానికులు వచ్చి.. ఆగ్రహంతో ఫాతిమా ఇంటిని ధ్వంసం చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:వృద్ధ యాచకులపై కానిస్టేబుల్ దాడి- వీడియో వైరల్!