కేరళ కాసర్గోడ్ జిల్లాకు చెందిన కే లలిత.. మిర్రర్ రైటింగ్‌లో అరుదైన రికార్డు సాధించారు. విరామం లేకుండా మలయాళంలో కుడి నుంచి ఎడమకు రాసి ప్రఖ్యాత ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.
లాక్డౌన్లో సాధన

లాక్డౌన్ సమయంలో లలితకు ఆమె పిల్లలు మిర్రర్ రైటింగ్ ఆలోచన చెప్పారు. అప్పటి నుంచి రోజూ సాధన చేశారు. కొద్ది కాలంలోనే అత్యంత కష్టమైన మిర్రర్ రైటింగ్‌ను అలవోకగా, వేగంగా రాయటం నేర్చుకున్నారు. భారత్‌లోని అన్ని రాష్ట్రాల, 700పైగా ఉన్న జిల్లాల పేర్లను మలయాళంలో కుడి నుంచి ఎడమకు అలవోకగా రాస్తున్నారు.
తన భర్త, పిల్లల ప్రోత్సాహంతోనే తాను ఈ ఘనత సాధించానని లలిత తెలిపారు. భవిష్యత్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించటమే లక్ష్యంగా ముందుకెళ్తానని తెలిపారు.
ఇదీ చదవండి :సైకత శిల్పంతో వన్యప్రాణుల సంరక్షణా సందేశం