బ్రిటన్ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ సహా పలువురు దిగ్విజయంగా అంతరిక్షయాత్ర చేసి.. తిరిగి భూమికి చేరుకున్నారు. దీంతో రోదసియాత్రపై(Space tourism) ప్రజల్లో ఆసక్తి పెరిగినట్లు తెలుస్తోంది. తాజాగా వర్జిన్ గెలాక్టిక్(virgin galactic) నౌకలో అంతరిక్షయాత్ర చేయడానికి ఓ భారతీయుడు కూడా టికెట్ బుక్ చేసుకున్నారు. దీంతో ఆకాశవీధుల్లో విహరించే తొలి వ్యక్తి కానున్నారు కేరళకు చెందిన సంతోశ్ జార్జ్ కులంగర. 2.5 లక్షల డాలర్లు (రూ.1.8 కోట్లు) వ్యయంతో ఈ అంతరిక్ష పర్యటనకు వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఓ కెమెరా కూడా తీసుకెళ్లనున్నట్లు సంతోశ్ తెలిపారు. అలాగే ఈ పర్యటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మళయాలీల తరఫున చేపడుతున్నానని పేర్కొన్నారు.
భారత తొలి అంతరిక్ష యాత్రికుడిగా రికార్డ్! - రిచర్డ్ బ్రాన్సన్
కేరళకు చెందిన ప్రసిద్ధ పర్యటకుడు సంతోశ్ జార్జ్ కులంగర అంతరిక్ష యాత్రకు(Space tourism) వెళ్లనున్నారు. ఇందుకు రిచర్డ్ బ్రాన్సన్కి చెందిన వర్జిన్ గెలాక్టిక్(virgin galactic) నౌకలో రోదసిలో పర్యటించడానికి టికెట్ బుక్ చేసుకున్నారు.
![భారత తొలి అంతరిక్ష యాత్రికుడిగా రికార్డ్! India's first space tourist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12497470-thumbnail-3x2-ramm.jpg)
భారతీయ తొలి అంతరిక్ష యాత్రికుడు
సంచారం అనే పేరుతో వన్ మ్యాన్ ఆర్మీ ట్రావెల్లాగ్ కార్యక్రమం ద్వారా యాత్రలు చేసి.. ప్రసిద్ధి చెందారు సంతోష్. ఆయన ఇప్పటివరకు 24 ఏళ్ల వ్యవధిలో 130కి పైగా దేశాలను చుట్టి వచ్చారు. సంచారం ద్వారా ఇప్పటివరకు 1800 ఎపిసోడ్లను ప్రసారం చేశారు. సంతోశ్.. 2007 నుంచి అంతరిక్ష యాత్ర చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అవకాశం ఇప్పుడు లభించింది. దీంతో భారత్ నుంచి అంతరిక్ష పర్యటనకు వెళ్లనున్న తొలి భారతీయుడు కానున్నారు.
ఇదీ చూడండి:రోదసిలో కొత్త చరిత్ర- రిచర్డ్ అంతరిక్ష యాత్ర సక్సెస్