తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ బరి: 140 స్థానాలు- 957 మంది అభ్యర్థులు - అసెంబ్లీ ఎన్నికలు

కేరళలో అసెంబ్లీ ఎన్నికల సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. మొత్తం 140 నియోజకవర్గాలకు మంగళవారం ఒకే దశలో పోలింగ్​ నిర్వహించనుంది ఈసీ. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ఎన్నికలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. సీపీఎం నేతృత్వంలోని అధికార ఎల్​డీఎఫ్​, కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా... భాజపా కూడా కీలకంగా మారాలని చూస్తోంది. మే 2న ఫలితాలు వెల్లడించనున్నారు.

Kerala to witness a tough unpredictable battle on April 6
కేరళ ఎన్నికలు

By

Published : Apr 5, 2021, 5:52 PM IST

కేరళ పోరు కీలక ఘట్టానికి చేరింది. మొత్తం 140 శాసనసభ స్థానాలకు మంగళవారం ఒకే దశలో పోలింగ్​ జరగనుంది. కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని జాగ్రత్తల నడుమ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ సాగనుంది. ప్రచారం ఆదివారంతో ముగిసిన నేపథ్యంలో.. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్​ కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

కేరళ ఎన్నికలు-2021

  • శాసనసభ స్థానాలు- 140
  • మొత్తం అభ్యర్థులు - 957
  • పోలింగ్​ కేంద్రాలు: 2736
  • ఓటర్లు: 2,74, 46, 039
  • పురుషులు: 1,32,83,724
  • మహిళలు: 1,41, 62, 025
  • ట్రాన్స్​జెండర్లు: 290
  • ఎన్నికల ఫలితాలు: మే 2

గెలుపుపై ధీమా..

సీపీఎం నేతృత్వంలోని అధికార వామపక్ష ప్రజాస్వామ్య వేదిక(ఎల్​డీఎఫ్​) మరోసారి అధికారంలోకి రావాలని ఊవిళ్లూరుతోంది. ఐదేళ్లకు ఓసారి అధికారం మారే సంప్రదాయానికి ఈ దఫా చెక్​ పెట్టాలని చూస్తోంది.

సీఎం పినరయి విజయన్​ గత ఐదేళ్లలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొన్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆయన హయాంలోనే రాష్ట్రాన్ని రెండేళ్లు వరదలు ముంచెత్తాయి. నిఫా వైరస్‌, తర్వాత కొవిడ్‌ మహమ్మారి వంటి ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు తలెత్తాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వంటి అంశాలు రాష్ట్రాన్నీ కుదిపేశాయి.

ఇవీ చూడండి: నియోజకవర్గానికి దూరంగా ఎమ్మెల్యే- ప్రజల తీర్పేంటి?

కేరళ పోరులో 26ఏళ్ల అరిత ఎంతో ప్రత్యేకం!

కేరళ: ఒకరిది వృద్ధి మాట.. మరొకరిది ఉద్వేగాల బాట

విపక్షాల ఆరోపణలు..

కాంగ్రెస్​ నేతృత్వంలోని ఐక్య ప్రజాస్వామ్య వేదిక(యూడీఎఫ్​), భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ గట్టిపోటీనిచ్చే అవకాశాలున్నాయి. అదే రీతిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి.

అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్​ నుంచి రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు సీనియర్లు కేరళలో పర్యటించారు.

బంగారం స్మగ్లింగ్​ వ్యవహారం, శబరిమల అంశాలే ప్రధానంగా అధికార పక్షంపై విమర్శలు గుప్పించింది భాజపా. అక్కడ హేమాహేమీలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. జోరుగా ప్రచారాల్లో పాల్గొన్నారు.

కొన్నాళ్లుగా ఓట్ల శాతాన్ని పెంచుకుంటున్న భాజపా.. త్రిస్సూర్​, తిరువనంతపురం, కాసరగోడ్, పాలక్కడ్​ జిల్లాల్లోని పలు స్థానాలపై దృష్టి సారించింది.

కేరళ బరి: 140 స్థానాల్లో పోటీకి 957 మంది సై

కేరళ బరిలో కీలక నేతలు

పినరయి విజయన్​

  • పార్టీ: సీపీఎం​
  • నియోజకవర్గం: ధర్మదామ్

ఊమెన్​ చాందీ

  • పార్టీ: కాంగ్రెస్​
  • నియోజకవర్గం: పూతుపల్లి

ఈ. శ్రీధరన్​

  • పార్టీ: భాజపా
  • నియోజకవర్గం: పాలక్కడ్​

కేకే శైలజ

  • పార్టీ: సీపీఎం
  • నియోజకవర్గం: మట్టనూర్​

అరితా బాబు

  • పార్టీ: కాంగ్రెస్​
  • నియోజకవర్గం: కాయంకుళం

పీవీ అన్వర్​

  • పార్టీ: ఎల్​డీఎఫ్​ ఇండిపెండెంట్​
  • నియోజకవర్గం: నిలంబూర్​

పోటీలో సినీ ప్రముఖులు..

దాదాపు 200 చిత్రాల్లో నటించిన సురేశ్​ గోపి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

సినీ ప్రముఖులు

స్టార్​ కిడ్స్​..

సీఎం అల్లుడు మహమ్మద్​ రియాస్​తో పాటు.. పలువురు రాష్ట్ర మంత్రులు, మాజీ మంత్రుల బంధువులు తమ భవితవ్యం తేల్చుకోనున్నారు.

ఎల్​డీఎఫ్​ స్టార్​ కిడ్స్​
యూడీఎఫ్​ స్టార్​ కిడ్స్​

2016లో ఎల్​డీఎఫ్​కు భారీ మెజార్టీ దక్కింది. మిత్రపక్షాలతో కలిసి.. ఈసారీ ఆధిక్యం కనబరచాలని పట్టుదలతో ఉంది యూడీఎఫ్​. అప్పుడు ఒక్క స్థానానికే పరిమితమైన భాజపా.. ఈసారి మరింత ప్రభావం చూపాలని భావిస్తోంది.

కేరళ బరి: 140 స్థానాల్లో పోటీకి 957 మంది సై

మరి.. అధికారం మారే సంప్రదాయానికి ఈసారి యూడీఎఫ్​ చెక్​ పెడుతుందా? ఎల్​డీఎఫ్​ మళ్లీ విజయఢంకా మోగిస్తుందా? లేక భాజపా మాయ చేస్తుందా? తెలియాలంటే మే 2 వరకు ఎదురుచూడాల్సిందే!

ఇవీ చూడండి: విజయన్‌ చరిత్ర సృష్టిస్తారా?

వీఎస్ లేమితో కళ తప్పిన వామపక్షాల ప్రచారం!

కేరళలో 'బ్యాక్​ డోర్​' రాజకీయం- విజయన్​కు కష్టమే!

కాంగ్రెస్ 'శబరిమల వ్యూహం' ఫలిస్తుందా?

ABOUT THE AUTHOR

...view details