ఇప్పటి వరకు మద్యం, ధూమపానం.. ఈ రెండింటికే డి-అడిక్షన్ సెంటర్లు నిర్వహిస్తారని వింటూ వచ్చాం. కానీ కేరళ ప్రభుత్వం ఆన్‌లైన్ గేమ్స్‌కి(Online Games) బానిసవుతున్న చిన్నారులను దృష్టిని పెట్టుకొని డిజిటల్ ఆన్‌లైన్ గేమ్స్(Online Games) డి-అడిక్షన్ సెంటర్లను ప్రారంభించనుంది.
తరచూ డిజిటల్ గేమ్స్ ఆడటం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలెక్కువ. ఆ సమస్యల నుంచి బయటపడేందుకు 'డిజిటల్ డి-అడిక్షన్ సెంటర్లు'ను కేరళలో ప్రారంభిస్తున్నట్లు శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. ఈమేరకు రాష్ట్రంలోని 20 పోలీస్ స్టేషన్లను 'చైల్డ్-ఫ్రెండ్లి'గా ప్రకటించారు.