లాక్డౌన్ విధించడం వల్ల పలు రాష్ట్రాల్లో కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేరళలో తాజాగా 29,704 కొత్త కేసులు నమోదయ్యాయి. 89 మంది మరణించారు. దిల్లీలోనూ కేసులు గణనీయంగా తగ్గాయి.
- దిల్లీలో కొత్తగా 6,456 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 262 మంది మృతి చెందారు. లాక్డౌన్ను మరో వారం పాటు పొడిగించారు.
- మహారాష్ట్రలో మరో 34 వేల 389 మందికి వైరస్ సోకింది. 974 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల 60 వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.
- కర్ణాటకలో ఇవాళ 31 వేల 531 కొత్త కేసులు, 403 మరణాలు నమోదయ్యాయి.
- బంగాల్లో కేసులు కాస్త తగ్గాయి. మరో 19 వేల 117 మంది కొవిడ్ బారినపడ్డారు. 147 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఉత్తర్ప్రదేశ్లో కొత్తగా 17,546 కేసులు బయటపడ్డాయి. మరో 311 మంది వైరస్ బారిన పడి మరణించారు.