తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Kerala Road Accident : లోయలో పడ్డ జీపు.. 9 మంది కూలీలు మృతి

Kerala RKerala Road Accident : ఓ జీపు అదుపుతప్పి 25 మీటర్ల లోయలో పడిపోవడం వల్ల 9 మంది కూలీలు చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం కేరళ వయనాడ్​లో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో జరిగింది.

Kerala RKerala Road Accident
Kerala RKerala Road Accident

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 5:22 PM IST

Updated : Aug 25, 2023, 7:57 PM IST

Kerala Road Accident : కేరళ వయనాడ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మహిళా కూలీలు మరణించారు. ఓ జీపు అదుపుతప్పి 25 మీటర్ల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో టీ ఎస్టేట్​లో పని చేసే 9 మంది కూలీలు చనిపోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తళప్పుజాలోని కన్నోత్​ హిల్​ వద్ద జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మనంతవాడీ మెడికల్ కాలేజీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులను టీ ఎస్టేట్​లో పనిచేసే రాణి, శాంత, శోభన, మార్యక్క, వసంత, రబియా, చిన్నమ్మ, షాజా, లీలాగా గుర్తించారు పోలీసులు. వీరంతా వయనాడ్​ జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.

లోయలో పడ్డ జీపు

Kerala Jeep Accident : పరిమితికి మించి వాహనంలో ప్రయాణికులను ఎక్కించడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. లోయలో భారీగా రాళ్లు ఉండడం వల్ల.. కూలీల తలలకు తీవ్ర గాయాలై మృతి చెందారని వివరించారు. సహాయక చర్యల్లో స్థానికులు పాల్గొని.. క్షతగాత్రులను రోడ్డుపైకి తీసుకువచ్చారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్​.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు.

క్షతగాత్రులకు వైద్యం అందించాలని సీఎం విజయన్‌ ఆదేశం
ఈ ప్రమాదంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్‌ను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మరోవైపు, ఈ ఘటనపై వయనాడ్‌ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడానని.. త్వరగా స్పందించాలని కోరినట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన రాహుల్‌.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్​లో (ప్రస్తుతం ఎక్స్​) పోస్ట్ చేశారు.

UP Tractor Accident News : నదిలో పడిపోయిన ట్రాక్టర్.. నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి

Mizoram Railway Bridge Collapse : నిర్మాణంలో ఉండగా కూలిన రైల్వే వంతెన.. 23 మంది కూలీలు మృతి

Last Updated : Aug 25, 2023, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details