కేరళలో కరోనా రోజువారీ కేసులు(Kerala Corona Cases) క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. కొత్తగా ఆ రాష్ట్రంలో 8,743 మంది.. వైరస్(Kerala Corona Cases) బారిన పడినట్లు తేలింది. వైరస్(Kerala Covid Cases News) కారణంగా మరో 118 మంది మృతి చెందారు. ఫలితంగా ఇప్పటివరకు కేరళలో నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 48,79,317కు చేరింది. మరణాల సంఖ్య 27,202కు పెరిగింది. మరో 9,855 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 81,496కు పడిపోయింది.
కేరళలో గురువారం 86,303 నమూనాలను పరీక్షించారు. ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 1,434 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు తేలింది. తిరువనంతపురంలో 1,102, త్రిస్సూర్‌లో 1,031 మందికి వైరస్ నిర్ధరణ అయింది.
మహారాష్ట్రలో కొత్తగా 1,573 మందికి కరోనా(Maharashtra Coronavirus) సోకింది. మరో 39 మంది వైరస్ కారణంగా మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 65,98,218కి చేరగా.. మరణాల సంఖ్య 1,39,925కు పెరిగింది. మరో 2,968 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.