కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే 31 వేల 445 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా గడిచిన 24 గంటల్లో మహమ్మారితో 215 మంది మృత్యువాత పడ్డారు. గత మే నెల తర్వాత నేడు మళ్లీ భారీ స్థాయిలో కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కొవిడ్ పాజిటివ్ రేటు 19 శాతం మార్క్‌ను దాటినట్లు వివరించారు.
ఓనమ్ పండుగ నేపథ్యంలో పాజిటివ్ రేటు 20 శాతం దాటుతుందని వైద్య నిపుణులు ముందుగానే అంచనా వేశారు. ఈ ఏడు బక్రీద్ అనంతరం కేరళలో రోజూ 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 20 వేల 271 మంది మహమ్మారి బారి నుంచి కోలుకోగా ప్రస్తుతం లక్షా 70 వేల 292 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మరో వైపు మహారాష్ట్రలో కొత్తగా 5,031 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 216 మంది చనిపోగా.. కొత్తగా 4,380 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
దేశ రాజధాని దిల్లీలో.. 35 మందికి వైరస్ సోకింది. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు.