మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్న కేరళ సహా పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య(Coronavirus Update) క్రమంగా తగ్గుతోంది. కేరళలో కొత్తగా 20,452 కేసులు నమోదయ్యాయి . 16,856 మంది కోలుకోగా 114 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,62,090కి చేరింది.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మరో 6,686 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. కరోనా ధాటికి 158 మంది మృతిచెందగా.. 5,861 మంది మహమ్మారిని జయించారు.
దేశ రాజధానిలో కొత్తగా 50 కేసులు నమోదయ్యాయి. వరుసగా మూడో రోజు కూడా దిల్లీలో ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- తమిళనాడులో కొత్తగా 1,933 కరోనా కేసులు బయటపడ్డాయి. 1,887 మంది కోలుకోగా.. 34 మంది మృతిచెందారు.
- కర్ణాటకలో కొత్తగా 1,669 మందికి కరోనా సోకగా.. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,672 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- ఒడిశాలో కొత్తగా 1,193 కొవిడ్ కేసులు నమోదుకాగా.. 60 మంది మృతిచెందారు.
- మిజోరంలో కొత్తగా 575 కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 174కు చేరింది.
ఇదీ చదవండి :కరోనా థర్డ్ వేవ్‌కు ఈ లెక్కలే సంకేతమా?