కేరళలో కరోనా (Corona cases) విజృంభణ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 20,224 కేసులు నమోదయ్యాయి. మరో 17,142 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 99 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 37.86 లక్షలకు చేరింది.
కేరళలో 20వేల కరోనా కేసులు- మిగతా రాష్ట్రాల్లో ఇలా.. - వివిధ రాష్ట్రాల్లో కేసులు
కేరళలో కరోనా(Corona cases) ఉద్ధృతి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 20,224 కేసులు వెలుగుచూశాయి. ఇక మహారాష్ట్రలో ఒక్కరోజే 4వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదవగా.. తమిళనాడులో 1,667 మందికి వైరస్ సోకింది.
రాష్ట్రాల్లో కరోనా కేసులు
మహారాష్ట్రలో కొత్తగా 4,365 కరోనా కేసులు వెలుగు చూశాయి. మరో 105 మంది చనిపోగా.. కొత్తగా 6,384 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశ రాజధాని దిల్లీలో.. 57 మందికి వైరస్ సోకింది. కరోనా కారణంగా ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. కరోనా రెండో దశ వ్యాప్తి తర్వాత దిల్లీలో ఒక్క మరణం కూడా నమోదవకపోవడం ఇది పదకొండోసారి.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- తమిళనాడులో 1,667 మంది మహమ్మారి బారిన పడ్డారు. 1,887 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరో 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కొత్తగా 1,298 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,833 మంది కోలుకోగా.. 32 మంది మృతిచెందారు.
- ఒడిశాలో కొత్తగా 986 మందికి కరోనా సోకగా.. 69 మంది ప్రాణాలు కోల్పోయారు.
- గుజరాత్లో 17, ఉత్తర్ప్రదేశ్లో 26, మధ్యప్రదేశ్లో 8 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి.
- పంజాబ్లో మరో 59 కేసులు నమోదు కాగా.. వైరస్ బాధితుల సంఖ్య 6,00,180కి పెరిగింది.
- అసోంలో.. 708 కరోనా కేసులు వెలుగు చూడగా మరో 13 మంది మరణించారు.