కరోనా వ్యాప్తి(Corona virus) ఆందోళనకర స్థాయిలో ఉన్న కేరళలో శనివారంతో పోలిస్తే కొవిడ్ కేసులు(Corona cases) తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 26,071 మంది మహమ్మారి బారిన పడగా.. 28,900 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 74 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 17.17 శాతంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం కేసుల సంఖ్య 42,07,838కి చేరగా మహమ్మారి ధాటికి ఇప్పటివరకు 21,496 మంది మృతిచెందారు.
Corona cases: కేరళలో కొత్తగా 26వేల కరోనా కేసులు - మహారాష్ట్రలో కరోనా
కరోనా తీవ్రస్థాయిలో ఉన్న కేరళలో రెండోరోజు కేసులు(Corona cases) తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 26వేల మందికి పాజిటివ్‌గా తేలింది. వైరస్ ధాటికి మరో 74 మంది మృతిచెందారు.
కేరళలో కొత్తగా 26వేల కేసులు.. తగ్గుతున్న ఉద్ధృతి!
ఇతర రాష్ట్రాల్లో..
- మహారాష్ట్రలో కూడా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. కొత్తగా 4,057 కేసులు బయటపడ్డాయి. 5,916 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. 67 మంది మృతిచెందారు.
- తమిళనాడులో కొత్తగా 1,592 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 1607 మంది వైరస్ నుంచి కోలుకోగా.. 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఒడిశాలో కొత్తగా 805 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా ఖుర్దా, కట్టక్ జిల్లాల్లో నమోదయ్యాయి. వైరస్ మరో ఏడుగురు బలయ్యారు.
- బంగాల్లో 707 కొత్త కేసులు బయటపడ్డాయి. 723 మంది కోలుకోగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీలో కొత్తగా 30 కేసులు నమోదు కాగా 333 మంది వైరస్‌ను జయించారు. వరుసగా ఐదో రోజు కూడా మరణాలు నమోదు కాలేదు.
ఇదీ చదవండి :Vaccination: 'దేశంలో 50శాతానికిపైగా వయోజనులకు కొవిడ్ టీకా'