తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో మళ్లీ 20వేలు దాటిన కరోనా కేసులు - కేరళలో కరోనా కేసులు

కేరళలో మరోసారి కరోనా విజృంభించింది. కొత్తగా ఆ రాష్ట్రంలో 21 వేల మందికి కరోనా సోకినట్లు తేలింది. కొవిడ్​తో మరో 152 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కొత్తగా 5 వేలకుపైగా కేసులు వెలుగు చూశాయి.

covid cases today, రాష్ట్రాల్లో కరోనా కేసులు
కేరళలో మరోసారి భారీగా కరోనా కేసులు

By

Published : Aug 10, 2021, 9:28 PM IST

కేరళలో సోమవారంతో పోలిస్తే కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. కొత్తగా 21,119 కేసులు బయటపడ్డాయి. 18,493 మంది కోలుకోగా.. 152 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 35,86,693కు చేరింది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 50 శాతానికిపైగా కేరళలోనే నమోదవుతున్నాయి.

దిల్లీలో కొత్తగా 52 కరోనా కేసులు బయటపడ్డాయి. 45 మంది కోలుకోగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

ఇతర రాష్ట్రాల్లో ఇలా..

  • మహారాష్ట్రలో కూడా కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 5,609 మందికి కరోనా సోకగా.. 137 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 7,568 మంది కోలుకున్నారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,338 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,947 మంది కోలుకోగా.. 31 మంది మృతిచెందారు.
  • అసోంలో కొత్తగా 1,120 మందికి కరోనా సోకింది. 1,066 మంది కోలుకోగా వైరస్​ ధాటికి మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • మేఘాలయాలో కొత్తగా 411 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మహమ్మారి కారణంగా మరో 11 మంది చనిపోయారు.

ఇదీ చదవండి :'దేశంలో 50% కేసులు ఆ రాష్ట్రం నుంచే!'

ABOUT THE AUTHOR

...view details