కేరళలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 13,049 కేసులు నమోదయ్యాయి. మరో 20,004 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 105 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 35.65 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 17,852 మంది వైరస్ బారిన పడి మృతిచెందారు.
మహారాష్ట్రలో కొత్తగా 4,005 మందికి కరోనా సోకింది. 7,568 మంది కోలుకోగా.. 68 మంది మృతిచెందారు. మరోవైపు దేశ రాజధాని దిల్లీలో 39 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు.
ఉత్తరాఖండ్లో వైరస్ కట్టడి కోసం.. ఆగస్టు 10 ఉదయం 6 గంటల నుంచి నుంచి ఆగస్టు 17 వరకు ఉదయం 6 గంటల వరకు కొవిడ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 31 మందికి కరోనా సోకింది. మరొకరు కరోనాతో ప్రాణాలు విడిచారు.