కార్యకర్త వినూత్న ప్రచారం- ఇల్లంతా 'కాంగ్రెస్' మయం కాంగ్రెస్‌పై తనకున్న ప్రేమతో కేరళ కొచ్చిలోని చెరాయ్కి చెందిన నోబెల్ కుమార్.. తన ఇంటినే ఎన్నికల ప్రచార కేంద్రంగా మలిచారు. ఇల్లు మొత్తం కాంగ్రెస్-యూడీఎఫ్ నాయకుల చిత్రాలతో పెయింటింగ్ వేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. యూడీఎఫ్ మేనిఫెస్టోను కూడా గోడలపై చిత్రించారు.
కాంగ్రెస్- యూడీఎఫ్ ప్రముఖుల చిత్రాలు " పెయింటింగ్ వేయటానికి నాకు 8 రోజులు పట్టింది. నా స్నేహితుడు రాధాకృష్ణన్ నాకు సహకరించారు. రూ. 9వేలు ఖర్చయింది. కాంగ్రెస్‌పై నాకున్న ప్రేమతోనే ఇలా చేశాను. ఆ పార్టీ వల్లే నేను ఇలా ఉన్నాను. ఎన్నికల తర్వాత కూడా చిత్రాలను చెరపను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ చిత్రాలు ఇలాగే ఉంటాయి."
-- నోబెల్ కుమార్, కాంగ్రెస్ కార్యకర్త
కాంగ్రెస్-యూడీఎఫ్ మయం
ఇంటి గోడలపై కాంగ్రెస్-యూడీఎఫ్ పార్టీ గుర్తులు, ప్రముఖ నాయకులు, మేనిఫెస్టో, ప్రముఖ పథకాలను రంగురంగుల చిత్రాలుగా వేసి ఆకర్షనీయంగా మలిచారు నోబెల్.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పెయింటింగ్స్ కాంగ్రెస్ కార్యకర్త చిత్రాలతో పెయింటింగ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, కేరళ ప్రతిపక్ష నాయకుడు రమేశ్ చెన్నితళ, కేరళ మాజీ సీఎం ఒమెన్ చాందీ, వైపిన్ నియోజకవర్గం యూడీఫ్ అభ్యర్థి దీపక్ జాయ్.. తదితర ప్రముఖ నాయకుల చిత్రాలు గోడలపై ఉన్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కేరళకు 'న్యాయ్' పథకాన్ని తీసుకొస్తున్న చిత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6 న ఎన్నికలు జరగనున్నాయి. మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చదవండి :కేరళ: ఒకరిది వృద్ధి మాట.. మరొకరిది ఉద్వేగాల బాట