తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నడ్డా సహా వెయ్యి మందిపై కేసు పెడతాం'

కరోనా నిబంధనలు ఉల్లంఘించి.. బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు మరో వెయ్యి మందిపై కేసు నమోదు చేస్తామన్నారు కేరళ పోలీసులు.

Kerala police to file case against Nadda and 1000 others for flouting COVID-19 protocol
నడ్డా సహా వెయ్యి మందిపై కేసు నమోదు!

By

Published : Feb 5, 2021, 8:00 PM IST

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా మరో వెయ్యి మందిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు కేరళ పోలీసులు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సభల్లో పాల్గొన్న ఇతర భాజపా నేతలపేర్లు ప్రస్తావించిన పోలీసులు.. వారిపైనా కేసు పెడతామన్నారు.

సభకు భారీగా హాజరైన భాజపా శ్రేణులు
సమావేశంలో పాల్గొన్న భాజపా కార్యకర్తలు

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేరళలో పర్యటిస్తున్నారు నడ్డా. ఈ నేపథ్యంలో త్రిస్సూర్​ జిల్లాలోని టెక్కిన్​కాడ్​ మైదానంలో భాజపా శ్రేణులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన ఆయన.. కేరళపై కేంద్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ లోటు పూడ్చడానికి.. రూ.19,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

సభకు భారీగా హాజరైన భాజపా శ్రేణులు

ఈ సభకు భారీగా హాజరైన భాజపా శ్రేణులు.. కరోనా నిబంధనలను మరిచారు. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీసులు ఈమేరకు వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి:జాతీయ జెండా కప్పినందుకు ఎఫ్​ఐఆర్​

ABOUT THE AUTHOR

...view details