తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిల్లు అడిగారని లిక్కర్​​ పారబోసి నిరసన.. వీడియో వైరల్​ - కోవాలంలో రసీదు లేని మద్యం సీసాలతో స్వీడన్​ దేశస్థుడు

Foreigner With Liquor Bottles: మద్యం సీసాలతో వెళ్తున్న ఓ విదేశీయుడిని పోలీసులు అడ్డగించి.. బాటిళ్లకు సంబంధించిన రసీదు చూపించాలని కోరారు. రసీదులు లేకపోవటం వల్ల మందును రోడ్డు పక్కన పారబోసి నిరసన తెలిపాడు. ఈ సంఘటన కేరళ కోవాలంలో జరిగింది.

Foreigner With Liquor Bottles
మద్యాన్ని పారబోస్తున్న విదేశీయుడు

By

Published : Jan 2, 2022, 2:05 PM IST

మద్యాన్ని పారబోస్తున్న స్వీడన్ దేశస్థుడు

Foreigner With Liquor Bottles: నూతన సంవత్సర వేడుకలను ఘనంగా చేసుకోవాలనుకున్న ఓ విదేశీయుడి ఆశలపై నీళ్లు చల్లారు కేరళ పోలీసులు. కొత్త సంవత్సర వేడుకల కోసమని ప్రభుత్వ మద్యం దుకాణం నుంచి కొనుగోలు చేసిన లిక్కర్​ను వెంట తీసుకుపోనీయకుండా అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఆ విదేశీయుడు తన దగ్గర ఉన్న మందును నేలపాలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ జరిగింది...

కేరళ తిరువనంతపురంలోని కోవాలంలో రసీదు లేని మద్యం సీసాలతో స్వీడన్​ దేశస్థుడు పోలీసులకు చిక్కాడు. కోవాలం బీచ్​ రోడ్డులో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో అతని దగ్గర మద్యం బాటిళ్లను పోలీసులు గుర్తించారు. వాటిని కొనుగోలు చేసినట్లు రసీదులు చూపించాలని విదేశీయుడ్ని కోరారు. కోవాలంలోని కేరళ అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం షాపులో బాటిళ్లను కొనుగోలు చేశానని వారికి చెప్పాడు. తన వద్ద బిల్​ లేదని పోలీసులకు తేల్చి చెప్పాడు. పాస్​పోర్ట్​ చూసిన అధికారులు అతడ్ని స్టిగ్​ స్టీఫెన్​ యాస్​బర్గ్​గా గుర్తించారు.

అయితే మద్యాన్ని తీసుకుపోయేదానికి అనుమతించమని పోలీసులు యాస్​బర్గ్​కు తేల్చి చెప్పారు. దీంతో పోలీసుల ప్రవర్తనకు నిరసనగా మద్యాన్ని రోడ్డు పక్కన పారబోశాడు ఆ వ్యక్తి.

ఇదీ చూడండి:మహిళల వేలం పేరుతో వికృత చేష్టలు.. ఆ యాప్‌ బ్యాన్!

ABOUT THE AUTHOR

...view details