తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వధూవరులు ఆ కౌన్సిలింగ్​కు హాజరైతేనే పెళ్లి! - pre-wedding counselling news

వివాహ బంధానికి అధికారికంగా గుర్తింపు కోసం వధూవరులు ఇకపై తప్పనిసరిగా ప్రీ వెడ్డింగ్​ కౌన్సిలింగ్​కు(pre-wedding counselling) కావాల్సి ఉంటుంది. ఆ కౌన్సిలింగ్​కు హాజరైనట్లు ధ్రువపత్రం సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్​ చేయాలని కేరళ మహిళ కమిషన్​ అక్కడి ప్రభుత్వానికి సూచించింది. వివాహితులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్​ ఛైర్​పర్సన్​ పీ. సతీదేవి తెలిపారు.

Kerala plans to make pre-wedding counselling compulsory for marriage registration
ఆ కౌన్సిలింగ్​ ధ్రువపత్రం సమర్పిస్తేనే వివాహ నమోదు!

By

Published : Oct 31, 2021, 2:49 PM IST

వరకట్న వేధింపులు, వివాహితులపై దాడులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ మహిళా కమిషన్​ కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి చేసుకోబోయే వధూవరులకు ముందస్తుగా కౌన్సిలింగ్(pre-wedding counselling)​ నిర్వహించి ఆ ధ్రువపత్రాన్ని పొందుపరిస్తేనే.. వివాహాన్ని అధికారికంగా నమోదు చేయాలని కేరళ ప్రభుత్వానికి సూచించింది. వివాహబంధంలో ఎదురయ్యే సమస్యలపై ఈ కౌన్సిలింగ్​లో వారికి అవగాహన కల్పించనున్నట్లు మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్​ పీ సతీదేవి తెలిపారు. ఇలా కౌన్సిలింగ్​కు సంబంధించిన సర్టిఫికెట్​ను వివాహ నమోదు సమయంలో కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కేరళలో మహిళలపై గృహహింస కేసులు నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సతీదేవి చెప్పారు. ఇప్పటికే చాలా మంది భర్త, అత్తమామల చేతిలో చిత్రహింసలు అనుభవించి కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడగా.. మరికొంత మంది దారుణ హత్యలకు గురైనట్లు వివరించారు. ముఖ్యంగా జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఉత్రా, విస్మయ కేసులను గుర్తు చేసిన ఆమె.. వారి మరణానికి భర్త, అత్తింటి వారి వేధింపులే కారణమని వివరించారు.

ఇదీ చూడండి:ఇంటికి పిలిచి బావను కాల్చి చంపిన బావమరిది

ABOUT THE AUTHOR

...view details