తమిళనాడులో ఈరోడ్‌లో కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్లకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఆ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లెనిన్ ప్రసాద్ నేతృత్వంలో ఆదివారం జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి కేరళ ఎంపీ రమ్య హరిదాస్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
కేరళ.. అలథూర్ ఎంపీ రమ్య హరిదాస్.. తమిళనాడు యూత్ కాంగ్రెస్ నాయకుల్ని, ఆ పార్టీ వార్డ్ మెంబర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్కసారిగా తమిళ పాటలు ఆలపించారు. కమల్ హాసన్ 'మూన్రం పిరై' సినిమాలోని 'కన్నె కలైమానే' పాట, విజయకాంత్ 'ఆసై మచాన్' మూవీలో 'ఆదియిలా చేసిన సొల్లి' పాటలను పాడారు. ఆ సమయంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, తమిళ అబ్బాయిని చూడమని నాయకులను కోరారు రమ్య.
"నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ పరిధిలో కొంత భాగం తమిళనాడు సరిహద్దుల్లో ఉంది. పర్యటనల్లో భాగంగా అక్కడకు వెళ్లినప్పుడు.. నేను తమిళ భాషలోనే వారితో మాట్లాడతాను. అందుకే తమిళ అబ్బాయిని చూడండి. వివాహం చేసుకుంటాను."
-- రమ్య హరిదాస్, కాంగ్రెస్ ఎంపీ