Kerala Mother daughter suicide: కేరళలో ఘోరం జరిగింది. 21 ఏళ్ల మహిళ తన ఏడాదిన్నర కూతురితో ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. పతనంతిట్ట జిల్లాలోని రాన్నీ పట్టణంలో ఈ ఘటన జరిగింది. మృతులను రింజా(21), అల్హనా అన్నాగా గుర్తించారు పోలీసులు. వీరు అంగమూళి కూచుపరంబిల్ కుటుంబానికి చెందినవారని తెలిపారు. రింజా భర్త సాజి చెరియన్ విదేశాల్లో ఉంటున్నారు. రింజా తన కూతురితో కలిసి.. బంధువుల ఇంటిలో ఉంటోంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఇద్దరూ శవమై కనిపించారు. బెడ్రూంలో అల్హనా మృతదేహం కనిపించగా.. మరో గదిలో రింజా శవాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు.
కుమార్తెతో కలిసి మహిళ ఆత్మహత్య.. పసికందుకు నిప్పంటించి.. - కేరళ క్రైమ్ వార్తలు
Kerala Mother daughter suicide: కేరళలో ఓ మహిళ, తన ఏడాదిన్నర కూతురితో ఆత్మహత్య చేసుకుంది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. మృతదేహాలను పరీక్షల నిమిత్తం పోస్ట్మార్టంకు తరలించారు.

Kerala Mother daughter suicide
ఇంట్లో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. గదులలో కాలిన గుర్తులు కనిపించాయి. ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు.. మృతదేహాలను పరీక్షల నిమిత్తం మార్చురీకి తరలించారు. కిరోసిన్ పోసుకునే వీరు మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. మరిన్ని వివరాలు శవపరీక్షల నివేదిక వచ్చాక తెలుస్తాయని చెప్పారు. రింజా తండ్రి సైతం గతంలో ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:స్మార్ట్ఫోన్ గిఫ్ట్ తిరిగివ్వలేదని.. ప్రియురాలి గొంతు కోసి..