తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Kerala Model Death: కేరళ మోడల్స్ మృతికి కారణం అతడే!

Kerala Model Death: కేరళ మోడల్స్ మృతికి సంబంధించి కీలక విషయం తెలిసింది. ఓ డ్రగ్​ బానిస వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడు వారితో అసభ్యంగా ప్రవర్తించి కారును ఫాలో కావడమే ప్రమాదానికి దారితీసినట్లు చెప్పారు.

కేరళ మోడల్స్, Kerala Model Death
కేరళ మోడల్స్ మృతికి డ్రగ్స్ బానిసే కారణం!

By

Published : Dec 2, 2021, 2:22 PM IST

Updated : Dec 2, 2021, 3:30 PM IST

Kerala Model Death: నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ మోడల్స్ మృతిచెందిన ఘటనకు సంబంధించి బుధవారం పోలీసులు కీలక విషయం వెల్లడించారు. డ్రగ్స్‌కు బానిసైన సాయిజు థంకచన్‌ అనే వ్యక్తే ఈ కేసులో ప్రధాన నిందితుడని తెలిపారు. అక్టోబర్ 31 రాత్రి జరిగిన కారు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్‌ (24), అదే పోటీలో రన్నరప్‌గా నిలిచిన అంజనా షాజన్ (25) దుర్మరణం చెందారు. కోచికి సమీపంలోని వైటిల్లా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో బోల్తా కొట్టింది. ఘటనాస్థలంలోనే వారిద్దరు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరోవ్యక్తి వారం వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవింగ్‌ చేస్తున్న వారి స్నేహితుడికి మాత్రం ప్రాణాపాయం తప్పింది.

kerala model accident

అన్సీ, అంజనా తన స్నేహితులతో కలిసి అక్టోబర్ 31న ఒక పార్టీకి వెళ్లగా.. అక్కడే సాయిజు థంకచన్‌ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో నిందితుడు మోడల్స్‌తో అభ్యంతరకరంగా ప్రవర్తించాడని, రాత్రి పూట హోటల్‌లో బస చేసేందుకు ఏర్పాటు చేయగలనని వారితో మాట్లాడినట్లు పేర్కొన్నారు. దాంతో ఈ ఇద్దరు మోడల్స్ వారి స్నేహితులతో కలిసి హోటల్‌ నుంచి బయటకు వచ్చి కారులో ఇళ్లకు వెళ్లిపోతుండగా.. సాయిజు కూడా వారిని అనుసరించాడు. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి దీన్ని గమనించి వేగంగా కారు నడపడం ప్రారంభించారని చెప్పారు. అదే ఘోర ప్రమాదానికి దారితీసింది. అయితే, ఈ ఘటనలో సాక్ష్యాలను ధ్వంసం చేశారని, హోటల్ యజమాని భయపడుతున్నారని అంజన సోదరుడు అర్జున్‌ ఆరోపించారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా నిందితుడిని పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

ఇదీ చదవండి:హైదరాబాద్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎమ్మెల్యే మృతి

Last Updated : Dec 2, 2021, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details