కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు తన ఉదారతను చాటుకున్నారు. ఓ కిడ్నీ రోగి చికిత్స కోసం.. తన చేతి బంగారు గాజులను సాయంగా అందజేశారు.
త్రిస్సూర్ జిల్లా ఇరింజలకుడలో కిడ్నీ మార్పిడికి సంబంధించిన వైద్య సహాయ కమిటీ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ క్రమంలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వివేక్ ప్రభాకర్ (27) పరిస్థితిని చూసి చలించిపోయారు. వివేక్‌కు కిడ్నీ మార్పిడి అనివార్యం కావడం వల్ల.. అతని వద్ద అంత మొత్తం లేక చికిత్స చేయించుకోలేక దుస్థితి. ఈ విషయం తెలుసుకున్న మంత్రి బిందు.. చలించిపోయారు. వెంటనే తన చేతికి ఉన్న బంగారు గాజులను తీసి.. చికిత్స నిమిత్తం అతనికి విరాళంగా అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఇరింజలకుడ ఎమ్మెల్యే హోదాలో వైద్య సహాయ కమిటీ సమావేశానికి బిందు హాజరయ్యారు.
విద్యాశాఖ మంత్రి ఉదారత.. చికిత్స కోసం చేతి బంగారు గాజులు - bindu minister helps kidney transplant patient in kerala
కిడ్నీ రోగి దుస్థితిని చూసి చలించిపోయిన కేరళ మంత్రి బిందు.. తన గొప్ప మనసును చాటుకున్నారు. చికిత్స కోసం.. బంగారు గాజులను విరాళంగా అందజేసి.. ఆదర్శంగా నిలిచారు.
![విద్యాశాఖ మంత్రి ఉదారత.. చికిత్స కోసం చేతి బంగారు గాజులు Kerala Minister's unexpected generosity: Donates gold bangle for kidney patient's treatment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15794056-93-15794056-1657534068543.jpg)
విద్యాశాఖ మంత్రి ఉదారత