తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ లాటరీలో కనకవర్షం.. రూ.12కోట్లు గెలుచుకున్న అజ్ఞాత వాసి! - కేరళ లాటరీ విషు విలువ

Kerala Lottery Result Today 2023 : కేరళలో ఓ వ్యక్తికి రూ.12 కోట్ల లాటరీ తగిలింది. విషు​ బంపర్ లాటరీలో అతడి ఈ అదృష్టం వరించింది. మరో ఆరుగురు రూ.కోటి చొప్పున, ఇంకో ఆరుగురు పది లక్ష రూపాయల చొప్పున గెలుచుకున్నారు.

kerala lottery result today
kerala lottery result today

By

Published : May 24, 2023, 10:33 PM IST

Kerala Lottery Result Vishu Bumper 2023 : కేరళలో ఓ వ్యక్తికి రూ.12 కోట్ల లాటరీ తగిలింది. విషు​ సందర్భంగా లాటరీ టికెట్​ను కొన్న ఓ వ్యక్తిని ఈ అదృష్టం వరించింది. విషు బంపర్ లాటరీ పేరుతో తిరువనంతపురం జిల్లాలో ఈ టికెట్లను కేరళ లాటరీ డిపార్ట్​మెంట్​ అమ్మింది. ​బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో విషు బంపర్​ లాటరీ డ్రా జరిగింది.
మలప్పురం జిల్లా తిరూర్‌లోని M5087 ఏజెన్సీకి చెందిన ఆదర్శ్ అనే వ్యక్తి.. ఈ రూ.12 కోట్ల విన్నింగ్​ టికెట్​ను విక్రయించాడు. విజేత లాటరీ టికెట్ నంబర్​ VE 475588. అయితే, ఇది కొన్నది ఎవరన్నది ఇంకా తెలియలేదు. 10% ఏజెన్సీ కమీషన్, 30% ఇతర పన్నులు మినహా చివరి మొత్తంలో 60% అతడు అందుకోనున్నాడు.

Kerala Lottery Result Today 2023 : తాజా డ్రాలో.. ఆరుగురికి రెండో బహుమతి లభించింది. వీరికి ఒకొక్కరికి కోటి రూపాయల చొప్పున అందజేస్తారు. మరో ఆరుగురికి మూడో బహుమతి వరించింది. వీరికి ఒకొక్కరికి రూ.10 లక్షలు ఇస్తారు. ఇంకో ఆరుగురు నాలుగో బహుమతిగా చెరో రూ.5 లక్షలు, ఐదో బహుమతిగా మరో ఆరుగురు తలో రూ. 2లక్షలు అందుకోనున్నారు. బంపర్ డ్రాలో మొత్తం 42 లక్షల లాటరీ టికెట్లు అమ్ముడయ్యాయి. లాటరీ టికెట్​ ధర రూ.300. గతంలో విషు బంపర్ మొదటి బహుమతి రూ.10 కోట్లుగా ఉండేది.

ఈ ఏడాది జనవరిలోనూ కేరళలో క్రిస్మస్- న్యూ ఇయర్ బంపర్ టికెట్ డ్రా జరిగింది. అప్పుడు ఓ వ్యక్తి రూ.16 కోట్లు గెలుచుకున్నాడు. తిరువనంతపురం జిల్లాలోనే ఈ టికెట్లను కూడా లాటరీ డిపార్ట్​మెంట్ అమ్మింది​. మధుసూదనన్ అనే లాటరీ షాపు నిర్వాహకుడు.. రూ.16 కోట్ల విన్నింగ్ టికెట్​ను విక్రయించాడు. విజేత లాటరీ టికెట్ నంబర్​ XD 236433. క్రిస్మస్-న్యూ ఇయర్​ బంపర్​​ లాటరీ కేరళలో రెండో అతిపెద్ద లాటరీ. ఓనమ్​ బంపర్​ టికెట్​ ఆ రాష్ట్రంలో అతిపెద్ద లాటరీ టికెట్​. దాని విలువ రూ.25 కోట్లు.

ఆ డ్రాలో.. పది మందికి రెండో బహుమతి లభించింది. వీరికి ఒకొక్కరికి కోటి రూపాయల చొప్పున అందజేశారు. మరో 20 మందికి మూడో బహుమతి వరించింది. వీరికి ఒకొక్కరికి లక్ష రూపాయలు ఇచ్చారు. బంపర్ డ్రాలో మొత్తం 32,43,908 మంది లాటరీ టికెట్లు కొనుగోలు చేశారు. లాటరీ టికెట్​ ధర రూ.400. అయితే 2022 క్రిస్మస్​-న్యూఇయర్​ బంపర్​.. మొదటి బహుమతి రూ.12 కోట్లుగా ఉండేది. అప్పుడు టికెట్​ రూ.300. ఈ సంవత్సరం టికెట్​ ధర రూ.100 మేర పెంచి.. లాటరీ విలువను రూ.16 కోట్లకు మార్చారు.

ABOUT THE AUTHOR

...view details