బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి అంటుంటారు పెద్దలు. దీన్ని నిజం చేసేలా ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఓ సినీ నటి ఇంట్లో పనివాడికి రూ. 10 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. అయితే, ఈ మొదటి బహుమతి గెలిచిన వ్యక్తి.. తన టికెట్‌ను ఎవరైనా కాజేస్తారనే భయంతో బయటకు కూడా రావడం లేదు.
ఫిల్మ్ స్టార్ ఇంట్లో పనివాడు.. కట్ చేస్తే కోటీశ్వరుడు.. రూ. 10 కోట్లు జాక్‌పాట్! - కేరళ లాటరీ ఫలితాలు 2023
పనివాడు కోటీశ్వరుడయ్యాడు. ఓ సినీ నటి ఇంట్లో పనిమనిషికి బంపర్ లాటరీ తగిలి.. రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యాడు. కేరళ బంపర్ లాటరీలో మొదటి బహుమతి గెలిచి రూ. 10 కోట్ల సొంతం చేసుకున్నాడు.
అసోంకు చెందిన ఆల్బర్ట్ టిగా అనే వ్యక్తి కేరళ కొచ్చిలో నివసిస్తున్నాడు. ఇతడు కొన్ని సంవత్సరాలుగా రజిని చాందీ అనే సినీ నటి ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నాడు. తరచూ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉన్న ఆల్బర్ట్.. అలాగే మరో టికెట్ (ఎస్ఈ 222282) కొన్నాడు. ఈసారి అతడిని అదృష్టం వరించింది. ఏకంగా రూ. 10 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. కేరళ లాటరీ డిపార్డ్మెంట్ 'సమ్మర్ బంపర్ బీఆర్ 90 లాటరీ' ఫలితాలను విడుదల చేసింది. దీంట్లో రూ. 10 కోట్ల లాటరీ గెలుచుకున్న అల్బర్ట్.. క్లైం ప్రాసెస్ పూర్తి చేసుకుని టికెట్‌ను కొచ్చిలోని ఓ బ్యాంకులో సమర్పించాడు. అయితే, ఈ లాటరీ టికెట్‌ను ఎర్నాకులం జిల్లాకు చెందిన లాటరీ ఏజెంట్ ఎమ్డీ జాన్ విక్రయించాడు. రెండో ప్రైజ్ గెలిచిన లాటరీ టికెట్ (ఎస్బీ 152330)ను కూడా జాన్ ఏజెన్సీయే విక్రయించింది.
కూలీకి జాక్‌పాట్.. పోలీస్ స్టేషన్‌కు పరుగు..
ఇటీవల మరో లాటరీ ఓ వలస కూలీకి తగిలింది. బంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఎస్‌కే బాదేశ్ ఓ దినసరి కూలీ. కొద్ది నెలల క్రితం కేరళ ఎర్నాకుళం జిల్లాలోని చొట్టానికర ప్రాంతానికి వలస వచ్చాడు. అయితే, బాదేశ్‌కు తరచూ లాటరీ టిక్కెట్లు కొనేవాడు. అలా చాలా సార్లు టికెట్లు కొన్నాడు.. కానీ, ఒక్కసారి కూడా అతడిని అదృష్టం వరించలేదు. కేరళ రాష్ట్ర లాటరీ విభాగానికి చెందిన 'స్త్రీ శక్తి' అనే లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. నిర్వాహకులు విజేతల జాబితాను ప్రకటించగా.. మొదటగా ఎస్ఆర్ 570994 అనే సంఖ్యతో ఉన్న టిక్కెట్ బాదేశ్ పేరుతో వచ్చింది. దీంతో రూ.75,00,000 ప్రైజ్ మనీని గెలుపొందాడు బాదేశ్. అయితే, ఎవరికైనా ఇలాంటి జాక్‌పాట్ తగిలితే అనందంతో గంతులేస్తారు. కానీ బాదేశ్ మాత్రం పోలీస్ స్టేషన్‌కు పరుగుతీశాడు. తన లాటరీ ఎలా క్లైం చేసుకోవాలో తెలియదని.. ఈ విషయం తెలిస్తే టికెట్‌ను ఎవరైనా కాజేస్తారని పోలీసులకు చెప్పాడు. బాదేశ్ బాధను అర్థం చేసుకున్న పోలీసులు.. లాటరీ క్లైమ్‌కి సంబంధించిన పూర్తి విధివిధానాలను అతడికి వివరించారు.