తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా పంజా- దిల్లీలో మరో 7,053 మందికి వైరస్

దేశంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. దిల్లీ, మహారాష్ట్ర, బంగాల్​ సహా.. దక్షిణాది రాష్ట్రాల్లో బాధితుల సంఖ్య స్థిరంగా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా దిల్లీలో వైరస్​ విలయతాండవం చేస్తోంది.

Kerala logs 5,804 new COVID-19 cases, 6,201 recoveries
కరోనా పంజా- దిల్లీలో మరో 7,053 మందికి వైరస్

By

Published : Nov 13, 2020, 10:34 PM IST

Updated : Nov 13, 2020, 11:09 PM IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు స్థిరంగా పెరుగుతూనే ఉన్నాయి. దిల్లీలో వైరస్​ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. దేశ రాజధానిలో మరో 7,053 కరోనా కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 4.67లక్షలు దాటింది. మరో 104 మంది కరోనాకు బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 7,332కు పెరిగింది.

  • కేరళపైనా మహమ్మారి పంజా విసురుతోంది. ఈ రాష్ట్రంలో ఒక్కరోజులోనే 5,804 మంది కొవిడ్​ బారినపడ్డారు. మొత్తం బాధితుల సంఖ్య 5లక్షల 14వేల 642కు పెరిగింది. మరో 26 మంది చనిపోవడం వల్ల.. మృతుల సంఖ్య 1,822కు ఎగబాకింది.
  • మహారాష్ట్రలో శుక్రవారం ఒక్కరోజే 4,132 మంది కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 17లక్షల 40వేల 461కి పెరిగింది. వైరస్​ కారణంగా మరో 127 మంది ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 45వేల 809కి ఎగబాకింది.
  • పశ్చిమ్​బంగాలో కొత్తగా 3,835 మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 4లక్షల 24వేల 675కు చేరింది. వైరస్​ ధాటికి మరో 51 మంది చనిపోయారు.
  • హరియాణా రాష్ట్రంపై కొవిడ్​ పంజా విసురుతోంది. ఆందోళనకర స్థాయిలో ఒక్కరోజులోనే 2,688 కరోనా కేసులు నమోదయ్యాయి.
  • ఉత్తర్​ప్రదేశ్​లో మరో 2,183 మందికి మహమ్మారి​ సోకినట్టు తేలింది. మొత్తం కేసుల సంఖ్య 5లక్షల 7వేల 602కు చేరింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 7,327 మంది కరోనాతో మృతి చెందారు.
  • కర్ణాటకలో మరో 2,016 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 8లక్షల 57వేల 928కు చేరింది. మరో 17 మరణాలతో.. చనిపోయిన వారి సంఖ్య 11,491కి పెరిగింది.
  • తమిళనాడులో కొత్తగా 1,939 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కేసుల సంఖ్య 7లక్షల 54వేల 460కి ఎగబాకింది. ఇప్పటివరకు అక్కడ 11వేల 454 కరోనా మరణాలు నమోదయ్యాయి.
Last Updated : Nov 13, 2020, 11:09 PM IST

ABOUT THE AUTHOR

...view details