దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ కాస్త తగ్గుముఖం పడుతోంది. దేశ రాజధానిలో వరుసగా రెండో రోజు 10వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయి. కేరళలోనూ కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.
దిల్లీ, కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం - దిల్లీలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో వరుసగా రెండో రోజు 10 వేలకు తక్కువగా నమోదయ్యాయి. దిల్లీలో కొత్తగా 6,430 కరోనా కేసులు, కేరళలో 32,680 కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో 34 వేలమందికిపైగా కరోనా బారినపడ్డారు.
కరోనా
వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసుల..
- కేరళలో కొత్తగా 32,680 కేసులు నమోదయ్యాయి. మరో 96 మంది మృతిచెందారు.
- దిల్లీలో కొత్తగా 6,430 కేసులు వెలుగుచూశాయి. మరో 337 మరణాలు సంభవించాయి.
- మహారాష్ట్రలో మరో 34 వేల 848 కేసులు, 960 మరణాలు నమోదయ్యాయి.
- కర్ణాటకలో మరో 41,664 మందికి కరోనా సోకింది. మరో 349 మంది మరణించారు.
- తమిళనాడులో ఒక్కరోజే 33 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరో 303 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బంగాల్లో 19,511 కొత్త కేసులు నమోదయ్యాయి. 144 మంది మృతిచెందారు.
ఇదీ చదవండి:10 రాష్ట్రాల్లోనే 85శాతం కరోనా కేసులు
Last Updated : May 15, 2021, 8:48 PM IST