కేరళలో కరోనా తీవ్రత అంతకంతకు ఎక్కువవుతోంది. గత ఆరు రోజులుగా తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. తాజాగా 30,196 మంది మహమ్మారి బారిన (Corona cases) పడ్డారు. 181 మంది బలయ్యారు. దీనితో రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 42,83,494కి చేరింది. మృతుల సంఖ్య(Corona Deaths) 22 వేల మార్క్ దాటినట్లు కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
కేరళలో తాజాగా 27,579 మంది కొవిడ్‌ను జయించారు. ఇప్పటి వరకు మొత్తం 40,21,456 మంది రికవరీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,39,480 యాక్టివ్ కొవిడ్ కేసులు ఉన్నాయి.
తమిళనాడులో తాజాగా 1,587 మందికి కరోనా సోకింది. 18 మంది కరోనాకు బలయ్యారు. 1,594 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 26,27,365 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో 35,073 మృతి చెందారు.