తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయిలో జోరుగా పండుగ షాపింగ్.. కేసుల పరిస్థితి ఏంటి? - కొవిడ్​-19 కేసులు

కేరళలో కరోనా విజృంభణ (covid cases in kerala) కొనసాగుతూనే ఉంది. కొత్తగా 26,200 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి ధాటికి మరో 125 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు మహారాష్ట్రలో కొవిడ్ నిబంధనలు లెక్కచేయకుండా వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. పండుగ నేపథ్యంలో ముంబయిలో రోడ్లన్నీ కిటకిటలాడాయి.

covid-19
కేరళ

By

Published : Sep 9, 2021, 11:45 PM IST

కేరళలో కరోనా కేసులు బుధవారంతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 26,200 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 43,09,694కు చేరింది. కరోనా ధాటికి మరో 125 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య (covid cases in kerala) 22,126గా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 16.69గా ఉంది.

పండుగ నేపథ్యంలో..

ముంబయి నగరంలో ఒక్కరోజే 458 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పండుగ నేపథ్యంలో మహారాష్ట్రలోని వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.

కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ..
దదర్ మార్కెట్​లో

ముంబయిలోని దదర్ మార్కెట్​ జనంతో కిక్కిరిసిపోయింది. ప్రజలు కొవిడ్ రూల్స్​ను ఉల్లంఘించి భారీ సంఖ్యలో తరలివచ్చారు.

దదర్ మార్కెట్​లో కిక్కిరిసిన జనం
దదర్ మార్కెట్​లో భారీ సంఖ్యలో ప్రజలు

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • మహారాష్ట్రలో కొత్తగా 4,219 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 55 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తమిళనాడులో తాజాగా 1,596 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 21 మరణాలు నమోదయ్యాయి.
  • కర్ణాటకలో కొత్తగా 1,074 వైరస్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి కారణంగా మరో నలుగురు బలయ్యారు.
  • మిజోరాంలో మరో 1,061మందికి వైరస్ సోకింది. కొవిడ్​ ధాటికి కొత్తగా ఇద్దరు మరణించారు. మిజోరాంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతంగా ఉంది.
  • దిల్లీలో కొత్తగా 35 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కానీ సున్నా మరణాలు నమోదయ్యాయి.

72 కోట్లు దాటిన డోసులు..

దేశంలో ఇప్పటివరకు అందించిన కొవిడ్ డోసులు 72 కోట్లు దాటినట్లు (covid vaccine) కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క గురువారం రోజే 73,80,510 డోసులు అందించినట్లు పేర్కొంది. దేశంలో 58శాతం వయోజనులకు కనీసం కొవిడ్ టీకా ఒక డోసు అందినట్లు తెలిపింది. వారిలో 18శాతం మందికి రెండు డోసులు అందినట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 35 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగానే ఉందని తెలిపింది.

ఇదీ చదవండి:ఫుల్​గా తాగి నడిరోడ్డుపై మోడల్ వీరంగం..

ABOUT THE AUTHOR

...view details