తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ బ్లాస్ట్​.. యువకుడికి గాయాలు! - ఫోన్​ పేలి 23 ఏళ్ల యువకుడు ఆస్పత్రికి తాజా వార్తలు

ప్యాంట్​ జేబులో మొబైల్​ ఫోన్​ బ్లాస్ట్​ కావడం వల్ల ఓ యువకుడికి గాయాలయ్యాయి. కేరళలో జరిగిందీ ఘటన.

Kerala youth injured after mobile phone explodes in his pants pocket
ఫోన్​ పేలడం వల్ల కాలిన జీన్స్​ ప్యాంట్​

By

Published : May 9, 2023, 11:00 PM IST

ఓ యువకుడు ప్యాంట్​ జేబులో పెట్టుకున్న మొబైల్ ఫొన్​ అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ఘటనలో అతడికి స్వల్ప గాయాలు అయ్యాయి. కేరళలోని కోజికోడ్​లో జరిగిందీ ప్రమాదం.
కోజికోడ్​ జిల్లాలోని పయ్యానక్కల్‌కు చెందిన 23 ఏళ్ల ఫారిస్ రెహమాన్ రైల్వేలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజులాగానే మంగళవారం ఉదయం 7 గంటలకు కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ ముఖం కడుక్కునేందుకు బాత్​రూమ్​కు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ప్యాంట్​ జేబులో ఉన్న 'Realme' కంపెనీకి సంబంధించిన ఫోన్​ బ్లాస్ట్​ అయింది. దీంతో అతడు ధరించిన జీన్స్​ ప్యాంట్​కు మంటలు అంటుకొని మొబైల్​ పూర్తిగా కాలిపోయింది. అక్కడే ఉన్న సహోద్యోగులు మంటలను ఆర్పి రెహమాన్​ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పేలిన Realme 8 మొబైల్​ ఫోన్​

కోర్టులో దావా!
పేలుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితుడు ఫారిస్ రెహమాన్.. Realme సంస్థపై వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపాడు. రెండు సంవత్సరాల క్రితమే తాను ఈ Realme 8 మోడల్​ మొబైల్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పాడు. అయితే బ్యాటరీలో వేడి కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని ఫోన్లు రిపేర్​ చేసే వారు చెబుతున్నారు.

ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ బ్లాస్ట్​.. యువకుడికి గాయాలు!

ఫోన్ బ్లాస్ట్​కు 8 ఏళ్ల చిన్నారి బలి​..
అచ్చం ఇలాంటి ఘటనే గతనెల ఏప్రిల్ 24న త్రిసూర్‌ జిల్లాలో వెలుగు చూసింది. తిరువిలుఅమల ప్రాంతంలో మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల ఆదిత్యశ్రీ అనే బాలిక మరణించింది. చిన్నారి తన తండ్రి మొబైల్‌లో వీడియోలు చూస్తూండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

ఫోన్​ పేలి వృద్ధుడు మృతి..
ఇలా మొబైల్​ ఫోన్ల పేలుడు ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి. ఇటీవలే మధ్యప్రదేశ్​లోని ఉజ్జయినిలో మొబైల్ ఫోన్​​ పేలి 60 ఏళ్ల దయారామ్ బరోద్​ అనే వృద్ధుడు మరణించాడు. ఈ పేలుడు కారణంగా మృతుడి మెడ, ఛాతీ భాగాలలో తీవ్రంగా గాయాలయ్యాయి. అలాగే ఛార్జింగ్​ పెట్టే స్విచ్​​ బోర్డు సైతం పూర్తిగా కాలిపోయింది.

ఇందౌర్​కు చెందిన దీపక్​ మృతుడు దయారామ్​తో మాట్లాడేందుకు ఫోన్ కలిపాడు. అప్పుడు దయారాం ఫోన్ కలవలేదు. దీంతో దీపక్​కు అనుమానం వచ్చింది. వెంటనే అతడు బంధువులకు సమాచారం అందించాడు. వారు ఘటనాస్థలికి చేరుకుని చూడగా దయారామ్ విగతజీవిగా పడిఉన్నాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ వార్త పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details