Kerala High Court Names Child : మూడేళ్ల చిన్నారికి పేరు పెట్టింది కేరళ హైకోర్టు. వేర్వేరుగా ఉంటున్న ఓ జంట మధ్య వారి పాపకు పేరు పెట్టే విషయంలోనూ వివాదం తలెత్తడం వల్ల.. హైకోర్టే చిన్నారికి నామకరణం చేసింది. జస్టిస్ బెచు కురియన్ థామస్ కోర్టు అధికార పరిధిని వినియోగించుకొని ఈ పనికి పూనుకుంది. తల్లి సూచించిన పేరుతోపాటు తండ్రి పేరునూ జత చేసి.. పాపకు ఓ పేరు ఖరారు చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు.
2020 ఫిబ్రవరిలో ఈ జంటకు ఓ కుమార్తె పుట్టింది. ఆ తర్వాత అభిప్రాయ భేదాలతో దంపతులు వేర్వేరుగా ఉన్నారు. పాప మాత్రం తల్లి వద్దే ఉంటోంది. గతంలో చిన్నారికి జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రంలో పేరు లేకపోవడం వల్ల.. ఓ పేరు నమోదు చేసేందుకు ఆమె తల్లి ప్రయత్నించారు. పేరు నమోదుకు కచ్చితంగా తల్లిదండ్రులిద్దరూ హాజరు కావాలని సంబంధిత అధికారి స్పష్టం చేశారు. దీంతో దంపతులిద్దరూ ఆ చిన్నారికి వేర్వేరు పేర్లు సూచించారు. ఇద్దరూ పట్టు వీడకపోవడం వల్ల.. కేరళ హైకోర్టును ఆశ్రయించారు చిన్నారి తల్లి. ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. చిన్నారికి పేరు పెట్టి సమస్యను పరిష్కరించారు.
ఇంటి పనిని భార్యాభర్తలిద్దరూ సమానంగా చేయాలి!'.. హైకోర్టు వ్యాఖ్యలు..
Household Work Couple :ఆధునిక సమాజంలో ఇంటి పని భారాన్ని.. భార్యాభర్తలిద్దరూ సమానంగా మోయాలని కొద్ది రోజల క్రితం బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఇద్దరూ ఉద్యోగాలు చేసినప్పుడు.. ఇంటి పని ఒక్క భార్యే చేయాలనుకోవడం పాత కాలపు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది.