lesbian couple live together: లెస్బియన్ జంట కలిసి జీవించవచ్చని కేరళ హైకోర్టు పేర్కొంది. యువతులిద్దరూ కలిసి జీవించకుండా వారి తల్లిదండ్రులు అడ్డుకోవడాన్ని తప్పుబట్టింది.
వివరాల్లోకి వెళితే..
lesbian couple Kerala news: సౌదీ అరేబియాలో చదువుకునే సమయంలో అదిలా(22), ఫాతిమా మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. కొద్దిరోజులకు లివింగ్ రిలేషన్ షిప్ ప్రారంభించారు. అయితే, దీనికి వారి కుటుంబ సభ్యులు అడ్డుచెబుతున్నారు.
'లెస్బియన్ జంట కలిసి జీవించొచ్చు'.. హైకోర్టు లైన్‌క్లియర్ - లెస్బియన్ రిలేషన్ షిప్
lesbian couple live together: ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవించవచ్చని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రులు వీరిద్దరు కలిసి ఉండడానికి అడ్డు చెప్పడాన్ని తోసిపుచ్చింది.

''మే 19న నేను కోజికోడ్‌కు వెళ్లి ఫాతిమాను కలిశాను. అక్కడి షెల్టర్ హోమ్‌లో మేం కొద్దిరోజులు ఆశ్రయం తీసుకున్నాం. కానీ మా బంధువులు మమ్మల్ని గుర్తించడం వల్ల పోలీసులు కలగజేసుకున్నారు.'' అని అదిలా తన పిటిషన్లో పేర్కొంది.
అదిలా బంధువులు ఆమెతో పాటు ఫాతిమాను అలువలోని తమ ఇంటికి తీసుకెళ్లిపోయారు. అనంతరం కొద్దిరోజులకు ఫాతిమా బంధువులు అలువకు వచ్చి ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. దీంతో అదిలా.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనంతరం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది.
ఇదీ చదవండి: