ఆన్‌లైన్ జూదం నిషేధం కేసుపై కేరళ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా క్రీడా, సినీ ప్రముఖులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ జూదం సంస్థలకు ప్రచారకర్తలుగా ఉన్నారంటూ.. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి తమన్నా భాటియా, నటుడు అజు వర్ఘీస్లకు బుధవారం నోటీసులు పంపించింది. పదిరోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
విరాట్, తమన్నా, అజులకు కేరళ హైకోర్టు నోటీసులు - తమన్నాకు కోర్టు నోటీసులు
ఆన్‌లైన్ జూదం నిషేధం కేసులో.. టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి తమన్నా భాటియా, నటుడు అజు వర్ఘీస్లకు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

విరాట్, తమన్నా, అజులకు కేరళ హైకోర్టు నోటీసులు
ఇదే అంశంపై కేరళ ప్రభుత్వానికి కూడా కేరళ హైకోర్టు.. నోటీసులు జారీ చేసింది.
Last Updated : Jan 27, 2021, 1:34 PM IST