బంగారం, డాలర్ స్మగ్లింగ్ కేసులను విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు సిఫారసు చేయాలని కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. స్మగ్లింగ్ కేసులను విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలపై న్యాయ విచారణకు కేరళ సిఫారసు చేయనుంది. నేడు జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఈసీ అనుమతి తర్వాతే..
బంగారం, డాలర్ అక్రమ రవాణా కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ పట్టాలు తప్పినందున.. ఆ సంస్థలపై న్యాయ విచారణకు సిఫారసు చేయాలని నిర్ణయించామని.. కేరళ మంత్రివర్గం వెల్లడించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ అనుమతి కోరిన తర్వాతే జ్యుడిషియల్ కమిషన్ నియమిస్తారని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు.
ఇదీ చదవండి:'రాజకీయాలకు 'కస్టమ్స్'ను వాడుకుంటున్నారు'
'ఇది కేరళ.. భాజపా రౌడీయిజం ఇక్కడ కుదరదు'