రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ మంత్రిని కేబినెట్ నుంచి తప్పించాలని కోరుతూ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్పై తాను విశ్వాసం కోల్పోయినట్లు పినరయి విజయన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు గవర్నర్. అక్టోబర్ 19న తిరువనంతపురంలోని ఓ యూనివర్సిటీ క్యాంపస్‌లో బాలగోపాల్ ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన వ్యాఖ్యలు దేశ ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. అందువల్ల, బాలగోపాల్పై విశ్వాసం కోల్పోయానని ప్రకటించడం మినహా తనకు వేరే అవకాశం లేకుండా పోయిందని గవర్నర్ తన లేఖలో వ్యాఖ్యానించారు.
రాష్ట్ర మంత్రిపై గవర్నర్ కొరడా.. కేబినెట్ నుంచి తప్పించాలని సీఎంకు లేఖ - Arif Mohammad Khan kerala
కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య నెలకొన్న వివాదం మరో అనూహ్య మలుపు తిరిగింది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్పై తాను విశ్వాసం కోల్పోయినట్లు ప్రకటించారు గవర్నర్. ఫలితంగా.. మంత్రివర్గం నుంచి ఆయన్ను తప్పించాలని సంకేతాలిచ్చారు.
కేరళ రాజకీయంలో భారీ ట్విస్ట్
కేరళలోని విజయన్ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కొంతకాలంగా వేర్వేరు అంశాలపై వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల విశ్వవిద్యాలయాల ఉపకులపతుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. తొమ్మిది యూనివర్సిటీల వీసీలను రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. గవర్నర్‌కు అలా ఆదేశించే అధికారాలు లేవని సీఎం ఎదురుదాడికి దిగారు. మరోవైపు.. గవర్నర్ ఆదేశాల్ని సవాలు చేస్తూ వీసీలు న్యాయపోరాటం మొదలుపెట్టారు.