Kerala Government School Uniform: విద్యార్థుల్లో లింగ అసమానతలను రూపుమాపేందుకు కేరళ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇకనుంచి ప్రభుత్వ పాఠశాలల్లో బాలురు, బాలికలు ఒకే రకమైన యూనిఫాం ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థిని విద్యార్థులు చొక్కా, ప్యాంట్ ధరించాలని సూచించింది. ఈ మేరకు కేరళ ఉన్నతవిద్యాశాఖ మంత్రి ఆర్ బిందు ఈ యూనిఫాం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ క్రమంలో.. కోజికోడ్‌లోని బాలుసెరీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలురు, బాలికలు ఒకే రకమైన యూనిఫాం ధరించారు. ఈ స్కూల్లో 12వ తరగతి విద్యార్థుల వరకు ఒకే రకమైన యూనిఫాం ధరించనున్నట్లు బాలుసెరీ పాఠశాల ప్రిన్సిపల్ ఆర్. ఇందు తెలిపారు.
ఒకే రకమైన యూనిఫాం ధరించిన స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతితోనే..
Kerala School Uniform News: తాము విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ ఆర్. ఇందు తెలిపారు. అయితే... ఇప్పటికే చాలామంది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇంతకుముందు ఎర్నాకులంలోని ఓ ప్రాథమిక పాఠశాలలోనూ పిల్లలకు ఒకే రకమైన యూనిఫాం అమలు చేసింది కేరళ సర్కార్.
ఒత్తిడి తెచ్చేందుకే..
అయితే కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొన్ని మతపరమైన సంస్థలు, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఒకే రకమైన యూనిఫాం ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం.. విద్యార్థులపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించాయి. ఈ విషయమై ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్(ఎమ్ఎస్ఎఫ్) కొన్ని గంటలపాటు ఆందోళన చేపట్టింది.
ఇదీ చూడండి:ప్రపంచంలో అత్యంత ఆరాధించే వ్యక్తుల్లో మోదీకి 8వ స్థానం