కేరళ రాజధాని తిరువనంతపురం నగర శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు సకాలంలో స్పందించి రెండేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడారు. అతడి కడుపులోని బ్యాటరీని బయటకు తీశారు.
చిన్నారి రిషికేశ్ బ్యాటరీ మింగిన వెంటనే అతడి తల్లిదండ్రులు ఇంటికి సమీపంలోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వైద్యులు అప్రమత్తమై చిన్నారిని ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. అతడికి మత్తు మందు ఇచ్చారు. అనంతరం కేవలం 20 నిమిషాల్లోనే ఎండోస్కోపీ ద్వారా బాలుడి కడుపు నుంచి బ్యాటరీని విజయవంతంగా బయటకు తీశారు.
టీవీ రిమోట్ బ్యాటరీ మింగిన చిన్నారి.. 20 నిమిషాల్లో కాపాడిన వైద్యులు - కేరళలో రెండేళ్ల బాలుడు రిమోట్ సెల్‌ను తినేసాడు
కేరళ రాజధాని తిరువనంతపురం శివారు ప్రాంతంలో ఓ రెండేళ్ల చిన్నారి టీవీ రిమోట్లోని బ్యాటరీని మింగాడు. సకాలంలో స్పందించిన వైద్యులు ఎండోస్కోపీ ద్వారా 20 నిమిషాల్లోనే బ్యాటరీని బయటకు తీశారు.
టీవీ రిమోట్ సెల్‌ను మింగిన చిన్నారి
పిల్లాడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్లు నిమ్స్ ఆస్పత్రి వైద్యుడు జయకుమార్ తెలిపారు. పొట్ట భాగంలో కాకుండా మరెక్కడైనా సెల్ ఇరుక్కుపోయి ఉంటే చికిత్స కష్టంగా మారేదని చెప్పారు. బాలుడు మింగిన టీవీ రిమోట్ బ్యాటరీ ఐదు సెంటీమీటర్ల పొడవు, ఒకటిన్నర సెంటీమీటర్ వెడల్పు ఉందని వివరించారు.
Last Updated : Dec 19, 2022, 7:15 PM IST