తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా పంజా- కేరళలో 5లక్షలు దాటిన కేసులు - Kerala Corona cases

దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతూనే ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కొవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేరళలో మరో 7వేల మందికి వైరస్ సోకింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 5లక్షలు దాటింది.

india covid cases
కరోనా పంజా: కేరళలో 5 లక్షల దాటిన కేసులు

By

Published : Nov 11, 2020, 10:26 PM IST

Updated : Nov 11, 2020, 11:07 PM IST

దేశంలో కొవిడ్​ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్టాల్లో వైరస్​ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. కేరళలో ఒక్కరోజులోనే 7,007 మంది కొవిడ్ బారినపడ్డారు. బాధితుల సంఖ్య 5లక్షల 2వేల 719కి చేరింది. మరో 29 మంది మృతితో.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,771కి ఎగబాకింది.

  • దేశ రాజధాని దిల్లీలో వైరస్​ విలయం కొనసాగుతోంది. మరో 8,593 కరోనా కేసులు బయటపడ్డాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 4లక్షల 59వేల 975కి ఎగబాకింది. మరో 85 మంది మృతితో.. చనిపోయిన వారి సంఖ్య 7,228కి చేరింది.
  • మహారాష్ట్రలో మరో 4,907 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. 129 మంది వైరస్​ కారణంగా మృతిచెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 17లక్షల 31వేల 833కి చేరింది. మృతుల సంఖ్య 45వేల 560కి పెరిగింది.
  • బంగాల్​లో కొత్తగా 3,872 కరోనా కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 4వేల 16వేల 984కు పెరిగింది. మరో 49 మరణాలతో.. మొత్తం మృతుల సంఖ్య 7,452కు చేరింది.
  • కర్ణాటకలో 2,584 కొత్త కేసులు నమోదవ్వగా.. 23 మంది మరణించారు. ఫలితంగా బాధితుల సంఖ్య 8లక్షల 53వేల 796కు ఎగబాకింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 11వేల 453 మంది కొవిడ్​కు బలయ్యారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 2,080 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 17వేల 151కి పెరిగింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 2,019 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
Last Updated : Nov 11, 2020, 11:07 PM IST

ABOUT THE AUTHOR

...view details