కేరళలో రోజువారీ కరోనా కేసుల(Kerala Covid Cases) సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే తగ్గింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 8,909 కేసులు(Kerala Covid Cases) వెలుగు చూశాయి. మరో 65 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు.
కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 48,97,587కి చేరింది. మరణాల సంఖ్య 28,229కు పెరిగింది. మరో 8,780 మంది కోలుకోగా యాక్టివ్ కేసుల సంఖ్య 80,555కు చేరింది.