కేరళలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం కొత్తగా 15,951మందికి వైరస్ నిర్ధరణ అయింది. 17,658 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి మరో 165 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 24,603కు పెరిగింది. ఇక కేరళవ్యాప్తంగా 1,63,280 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
కేరళలో కొత్తగా 15,951 కరోనా కేసులు - తమిళనాడు కరోనా కేసులు
కేరళలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 15,951కేసులు నమోదయ్యాయి. మరో 165 మంది మృతిచెందారు. అయితే.. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో లక్షకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
kerala
ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు..
- మహారాష్ట్రలో కొత్తగా 3,206 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 3,292 మంది కోలుకోగా.. 36మంది వైరస్‌కు బలయ్యారు.
- కర్ణాటకలో కొత్తగా 775 కరోనా కేసులు నమోదయ్యాయి. 860 మంది వైరస్‌ను జయించగా.. 9 మృతిచెందారు.
- తమిళనాడులో కొత్తగా 1,694 కరోనా కేసులు బయటపడ్డాయి. 1,658 మంది కోలుకోగా.. 14 మంది మృతిచెందారు.
- దిల్లీలో 29 కరోనా కేసులు నమోదవ్వగా.. ఎవరూ మరణించలేదు.
ఇవీ చదవండి:
Last Updated : Sep 27, 2021, 12:03 AM IST