తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పొలంలో ఇద్దరు పోలీసుల మృతదేహాలు.. ఏం జరిగింది? - దంపతుల హత్య

Kerala Cops Death: వరి పొలంలో ఇద్దరు పోలీసులు విగతజీవులుగా కనిపించటం కేరళలోని పాలక్కడ్​ జిల్లాలో కలకలం సృష్టించింది. ముట్టికులంగర పోలీస్​ క్యాంప్​ సమీపంలోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మరో ఘటనలో.. నవ దంపతులను గొంతు కోసి దారుణంగా హత్య చేశారు దుండగులు.

kerala cops death
వరి పొలంలో ఇద్దరు పోలీసుల మృతదేహాలు

By

Published : May 19, 2022, 4:59 PM IST

Updated : May 19, 2022, 6:20 PM IST

Kerala Cops Death: పోలీసు క్యాంపునకు సమీపంలోని వరి పొలంలో ఇద్దరు పోలీసులు విగతజీవులుగా కనిపించిన సంఘటన కేరళలోని పాలక్కడ్​ జిల్లాలో వెలుగు చూసింది. ముట్టికులంగర పోలీసు క్యాంప్​ సమీపంలోనే ఈ ఘటన జరగటం కలకలం సృష్టిస్తోంది. మృతులు క్యాంప్​లో విధులు నిర్వర్తిస్తున్న హవిల్దార్లు మోహన్​ దాస్​, అశోకన్​లుగా గుర్తించారు.
బుధవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయారని, ఆ సమయంలో వారు విధుల్లో లేరని ఉన్నతాధికారులు తెలిపారు. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా మృతి చెంది కనిపించారని చెప్పారు. మృతదేహాలపై కాలిపోయిన గుర్తులు ఉండటాన్ని చూస్తే విద్యుత్తు షాక్​తో మరణించి ఉంటారని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు.. చేపలు పట్టేందుకు వ్యవసాయ భూముల్లోకి వెళ్లి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. ఫొరెన్సిక్​, పోస్టుమార్టమ్​ నివేదికలు వచ్చాకే అసలు కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

కొత్త జంట గొంతుకోసి దారుణ హత్య: ఇటీవలే వివాహం చేసుకున్న ఓ జంటను గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​, కాన్పుర్​ జిల్లాలో గురువారం జరిగింది. శివమ్​ తివారీ(27), అతడి భార్య జూలీ తివారీ(24) బుధవారం రాత్రి వారి గదిలో నిద్రపోయారు. శివమ్​ తండ్రి దీపక్​ కుమార్​, సోదరుడు మోను డాబాపైన పడుకున్నారు. మరో గదిలో అద్దెకున్నవారు సైతం ఉన్నారు. అర్ధరాత్రి శివమ్​ గది తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన అద్దెకుండే వ్యక్తి లోపలికి వెళ్లి చూడగా.. రక్తపు మడుగులో ఇద్దరు పడిపోయి కనిపించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పదునైన ఆయుధంతో వారి గొంతు కోసినట్లు అదనపు డీసీపీ బ్రజేశ్​ శ్రీవాస్తవ తెలిపారు. తెలిసినవారు చేసిన పనిగానే అనుమానిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు.

Last Updated : May 19, 2022, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details