దేశవ్యాప్తంగా ఓవైపు కరోనా కొత్త కేసులు(Corona virus) అదుపులోకి వస్తుంటే.. కేరళలో మాత్రం వైరస్ ఉద్ధృతి(kerala corona cases today) కొనసాగుతూనే ఉంది. బుధవారం కొత్తగా 6,849 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఒక్కరోజే 388 మంది మరణించటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 50, 77,984కు, మరణాల సంఖ్య 36,475కు చేరింది.
బుధవారం మొత్తం 6,046 మంది వైరస్‌ను(Covid-19 virus) జయించారు. దీంతో రాష్ట్రంలో క్రియాశీల కేసుల సంఖ్య 63,752కు చేరింది. కేంద్రం, సుప్రీం కోర్టు కొత్త మార్గదర్శకాల ప్రకారం మరణాల సంఖ్య(Corona deaths) ఒక్కసారిగా పెరిగిందని అధికారులు తెలిపారు.
మొత్తం 69,334 నమూనాలు పరీక్షించగా.. అత్యధికంగా ఎర్నాకులం జిల్లాలో 958, ఆ తర్వాత కోజికోడ్‌లో 932, తిరువనంతపురంలో 839 కేసులు వెలుగుచూశాయి.
రెండు డోసులు తీసుకున్నవారే ఎక్కువ: ఆరోగ్య మంత్రి
దేశంలో అర్హులైన వారిలో.. ఒక్క డోసు తీసుకున్నవారి సంఖ్యను(Corona vaccination) పూర్తిస్థాయిలో టీకా తీసుకున్న వారి సంఖ్య తొలిసారి అధిగమించినట్లు ప్రకటించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా. ఇది ప్రధానమంత్రి విజన్, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానం, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకం ద్వారానే సాధ్యమైందన్నారు.
అలాగే.. ఇంటింటికీ టీకా కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని తెలిపారు. దేశవ్యాప్తంగా 113.68 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు చెప్పారు. అందులో రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 38,11,55,604 కాగా.. ఒకే డోసు తీసుకున్న వారు 37,45,68,477గా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘనత సాధించటంలో సామూహిక స్ఫూర్తిని అభినందిస్తున్నానన్నారు. అర్హులైన ప్రజలందరూ టీకా(Corona vaccine) తీసుకోవాలని కోరారు. కసికట్టుగా పోరాడితే కొవిడ్-19పై త్వరలోనే విజయం సాధిస్తామన్నారు. హర్ ఘర్ దస్తక్‌లో నెల రోజుల్లోనే అర్హులందరూ టీకా తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:Corona cases in India: 527రోజుల కనిష్ఠానికి కరోనా యాక్టివ్ కేసులు