కేరళలో స్థానిక సమరానికి రంగం సిద్ధమైంది. మూడు దశల్లో నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో భాగంగా.. తొలిదశ పోలింగ్ మంగళవారం జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఐదు దక్షిణాది జిల్లాల(తిరువనంతపురం, కొల్లాం, పతనమిట్ట, అలప్పుజ, ఇడుక్కి)లో జరిగే ఈ పోలింగ్‌కు 11,225 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియలో 56,122 మంది అధికారులు పాల్గొననున్నారు. ఎన్నికల సిబ్బంది సోమవారం ఉదయం పోలింగ్ సామగ్రిని ఆయా కేంద్రాలకు తరలించింది.
తొలిదశ పోలింగ్‌లో మొత్తం 24,584 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 41,58,341 మంది పురుషులు; 46,68,209 మంది స్త్రీలు సహా.. 70 మంది ట్రాన్స్జెండర్లు ఈ దఫా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ప్రచారానికి దూరంగా సీఎం