తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రశాంతంగా కేరళ 'స్థానిక' పోరు- ప్రముఖుల ఓట్లు - శశిథరూర్​ ఓటు కేరళ

కేరళలో తొలిదఫా స్థానిక పోరు ప్రశాంతంగా సాగుతోంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్​ సీనియర్​ నేత శశిథరూర్​, కేంద్రమంత్రి మురళీధరన్​ తిరువనంతపురంలో ఓటు వేశారు.

Kerala civic body polls underway amid corona crisis
ప్రశాంతంగా కేరళ స్థానిక పోరు- నేతల ఓట్లు

By

Published : Dec 8, 2020, 1:51 PM IST

కేరళలో తొలి దశ స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. మొత్తం 6,910 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ప్రజలు కరోనా నిబంధనలను పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఓటర్ల ఎదురుచూపులు
భౌతిక దూరం పాటిస్తూ
ఓటేసేందుకు బారులు తీరిన ప్రజలు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత శశి థరూర్​.. తిరువనంతపురంలోని ఓ పోలింగ్​ కేంద్రంలో ఓటేశారు. కేంద్రమంత్రి మురళీధరన్​ కూడా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఓటేసిన శశిథరూర్​
మురళీధరన్​ ఓటు
ఓటేసిన భాజపా నేత రాజశేఖరన్​

తొలిదశ పోలింగ్​లో మొత్తం 24,584 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 41,58,341 మంది పురుషులు; 46,68,209 మంది మహిళలు సహా.. 70 మంది ట్రాన్స్​జెండర్లు ఈ దఫా ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

తిరువనంతపురంలోని ఓ పోలింగ్​ కేంద్రం

ఇదీ చూడండి:-నాడు జవాన్​ను కాపాడింది.. నేడు రాజకీయాల్లోకి వస్తోంది

ABOUT THE AUTHOR

...view details